మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (17:58 IST)

మీ పిల్లలను జాగ్రత్తగా పెంచాలంటే... ఆ ఇడియట్స్‌కి దూరంగా ఉంచండి : రేణూ దేశాయ్

renu desai
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి, సినీ నటి రేణూ దేశాయ్ తల్లిదండ్రులకు ఓ సూచన చేశారు. మీ పిల్లలను జాగ్రత్తగా పెంచాలంటే ఇలాంటి ఇడియట్స్‌కి దూరంగా ఉంచండి. అలాంటి వారిని అన్‌ఫాలో చేయండి. యంగ్ జనరేషన్ అంతా కూడా ఎంతో బాధ్యతగా ఉండాలి. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అనే కేటగిరీ కింద వల్గారిటీ అనేది ఈ యూత్ యాక్సెప్ట్ చేస్తోంది" అంటూ రేణూ దేశాయ్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. 
 
ఇపుడీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు రేణూ దేశాయ్ చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. రేణూ దేశాయ్‌ ఈ తరహా పోస్ట్ చేయడానికి బలమైన కారణం ఉంది. 
 
'ఇండియా గాట్ లేటెంట్' అనే షోలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు రణవీర్ అలహాబాదియా, సమయ్ రైనా, అపూర్వ ముఖిజ చాలా చెత్తగా మాట్లాడిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, రణవీర్ మాట్లాడిన మాటలు అయితే సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి.
renu desai
 
షోలో భాగంగా, ఓ మహిళా కంటెస్టెంట్‌ను అతడు అడగకూడని ప్రశ్న వేశాడు. "మీ పేరెంట్స్ శృంగారం చేయడం జీవితాంతం చూస్తావా? లేక ఒకసారి నువ్వే సెక్స్‌లో పాల్గొని దాన్ని శాశ్వతంగా ఆపేస్తావా? అని అడగడం జరిగింది. దీంతో అతని ప్రశ్న విన్న షోలోని మిగతా వారు షాక్ అయ్యారు.  ఈ షో తాలూకూ వీడియో నెట్టింట వైరల్ కావడంతో అలాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడినందుకు రణవీర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.