గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 14 జులై 2024 (14:06 IST)

స్టార్ హీరోలకు రూ.2 కోట్ల విలువ చేసే వాచీలను గిఫ్ట్‌గా ఇచ్చిన అనంత్ అంబానీ!!

watch gift
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నెల 12వ తేదీన ముంబైలోని రిలయన్స్ జియో వరల్డ్ సెంటర్‌లు వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అయితే, ఈ వివాహానికి అనేక స్టార్ హీరోలు హాజరై వధూవరులను ఆశీర్వహించారు. ఇలా తన వివాహానికి వచ్చిన ఒక్కో స్టార్ హీరోకు అత్యంత ఖరీదైన వాచీలను బహుమతులుగా ఇచ్చారు. ఈ వాచీ ధర ఒక్కొక్కటి రూ.2 కోట్లు వరకు ఉంటుందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. లగ్జరీ వాచీలకు పేరెన్నిగన్న అడమోర్స్ పిగ్యుట్ కంపెనీ వీటిని తయారు చేసింది. 
 
కాగా, గత యేడాది డిసెంబరు నెలలో అనంతర్ - రాధికల నిశ్చితార్థం జదరిగింది. ఆ తర్వాత దాదాపు ఏడు నెలలపాటు అంబానీ ఇంట వేడుకలు జరిగాయి. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్‌లో వివాహంతో అనంత్-రాధిక ఒక్కటయ్యారు. శనివారం జరిగిన ఆశీర్వాద వేడుకకు భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, టీమిండియా క్రికెటర్లు సహా ప్రపంచం నలుమూలల నుంచి వేలాదిమంది అతిథులు హాజరయ్యారు.
 
తాజాగా ఇప్పుడు ఈ వేడుకకు సంబంధించిన మరో వార్త వైరల్ అవుతోంది. తనకు స్నేహితులైన బాలీవుడ్ నటులు షారూఖ్ ఖాన్, రణవీర్ సింగ్, షికర్ పహారియా, వీర్ పహారియా, మీజాన్ జాఫరి తదితరులకు వరుడు అనంత్ అంబానీ ఒక్కొక్కరికీ రూ.2 కోట్ల విలువైన రిస్ట్ వాచ్‌లను బహుమతిగా ఇచ్చారట. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
లగ్జరీ వాచీలకు పేరెన్నికగన్న అడమోర్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ క్యాలెండర్ లిమిటెడ్ ఎడిషన్ వాచీలను వీరు బహుమతిగా అందుకున్నారు. అనంతరం అందరూ కలిసి చేతికి ధరించిన వాచీలు చూపిస్తూ ఫొటోలు, వీడియోలకు పోజిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.