బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 జులై 2024 (09:05 IST)

పెళ్లి ఘట్టం ముగిసింది.. రాధిక మెడలో తాళికట్టిన అనంత్ అంబానీ

Anant Ambani
Anant Ambani
ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి అట్టహాసంగా జరిగింది. ఫార్మాస్యూటికల్ దిగ్గజాలు వీరేన్, శైలా మర్చంట్‌ల కుమార్తె, తన చిన్ననాటి స్నేహితురాలైన రాధికా మర్చంట్ మెడలో అనంత్ అంబానీ శుక్రవారం రాత్రి తాళి కట్టారు. 
 
అనంత్ అంబానీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన నారింజ రంగు షేర్వానీ ధరించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. బారాత్ ఊరేగింపులో కేవలం సంప్రదాయ ఆచారాలకే పరిమితం కాలేదు. పలువురు సెలబ్రిటీలు డ్యాన్స్ చేశారు. 
 
అమెరికా నటుడు, రాపర్ జాన్ సెనా, సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, రణవీర్ సింగ్‌తో పాటు పెళ్లి కొడుకు అనంత్ అంబానీ కూడా డ్యాన్స్ వేశారు. ఇక కింగ్ షారుఖ్ ఖాన్ నీతా అంబానీతో కలిసి చేసిన డ్యాన్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
 
ఇక శుక్రవారం రాత్రి పెళ్లి ఘట్టం ముగిసింది. ఇక విందు మాత్రమే మిగిలివుంది. శనివారం ఎంపిక చేసిన కొంతమంది సన్నిహిత అతిథులకు విందు కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. ఆదివారం గ్రాండ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు.