1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (16:05 IST)

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

babu - modi - pawan
మే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. మే 2వ తేదీన అమరావతికి వచ్చే ఆయన రాజధాని అమరావతి పునర్‌నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వచ్చే మూడేళ్ళలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, కోర్టు, రహదారులు పూర్తి చేయాలని ఆయన అధికారులను కోరారు. 
 
ఇన్‌ఛార్జ్ మంత్రుల పర్యటనలో మూడు పార్టీల నేతల భాగస్వామ్యం ఉండాలని సూచించారు. రెవెన్యూ సంబంధిత అంశాలను త్వరిగతగతిన పరిష్కరించాలని కోరారు. రెవెన్యూ సమస్యల్లో పోలీసుల జోక్యం అంశాలను పరిష్కరించాలని తేల్చి చెప్పారు. సూర్యఘర్ పథకం అమలు మరింత వేగం చేయాలని దిశానిర్దేశం చేశారు.