గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 ఆగస్టు 2024 (14:41 IST)

ప్రత్యేక గీతంలో శోభిత ధూళిపాళ్ల... ఆసక్తికర చర్చ!!

shobita dhullipalla
టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య మాజీ భార్య సమంతకు పెళ్లి తర్వాత అక్కినేని ఫ్యామిలీ ఆమె కెరీర్ విషయంలో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది. నాగ చైతన్య కూడా సినిమాల విషయంలో సమంతను ప్రోత్సహించారు. అయితే వివాహం అనంతరం సమంత బోల్డ్ రోల్స్ చేశారు. నాగ చైతన్యతో విభేదాలకు అది కూడా కారణం అనే ప్రచారం సాగింది. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో సమంత చేసిన నటన వారి విడాకులకు ఓ ప్రధాన కారణమన్న వార్తలు వచ్చాయి. చైతన్యతో కలిసి విడాకుల ప్రకటన జరిగిన నెలలోపే సమంత "పుష్ప" సినిమాలో ఐటైం సాంగ్ కూడా చేశారు. అదంతా ఇప్పుడు గతం అనుకుంటే... 
 
ఇటీవలే నాగచైతన్య, శోభితల నిశ్చితార్థం జరిగింది. వారి పెళ్లకి సంబందించి రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లానింగ్ జరుగుతున్నట్లుగా సమాచారం. ఈక్రమంలో పెళ్లి అనంతరం శోభిత నటన కొనసాగిస్తుందా అనే చర్చ సాగుతుంది. ఎదైతే సమంత చైతన్య విడాకుల విషయంలో ప్రముఖంగా వినిపించిన బోల్డ్ రోల్స్.. శోభితా తన కెరీర్ ముందు నుంచి పోషిస్తూనే ఉంది. 
 
అయితే శోభితాకు ఇప్పుడు "డాన్-3" సినిమాలో ఐటైంసాంగ్ చెసే అవకాశాన్ని దర్శకుడు ఫరాన్ అక్తర్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ పాటకు శోభితా తప్ప ఎవరు న్యాయం చేయలేరని ఫరాన్ నమ్మకంతో ఉన్నారట. మరీ ఈ ఛాన్స్‌ను శోభితా ఉపయోగించుకుంటుందా లేదా అన్నది తెలియాల్సివుంది. అలాగే, శోభితాకు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లభిస్తుందా అనే ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో నడుస్తొంది.