శనివారం, 14 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 ఆగస్టు 2024 (10:37 IST)

శోభిత ఫోటోలు.. అసలు నువ్వు, నేను ఎలా కలుసుకున్నాం?

Sobhita Dhulipala
Sobhita Dhulipala
టాలీవుడ్ టాప్ హీరో నాగ చైతన్య అక్కినేని శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరిగింది. ప్రస్తుతం వీరి నిశ్చితార్థం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు వీరిద్దరి నిశ్చితార్థాన్ని నాగార్జున ధ్రువీకరించారు. ఇంకా కొన్ని ఫోటోలను షేర్ చేశారు. తాజాగా శోభిత మరికొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వారి ఎంగేజ్‌మెంట్ ఈవెంట్‌లోని చిత్రాలను పంచుకుంటూ, శోభిత ఒక ఆసక్తికరమైన కవితను రాసింది.
 
 ఆమె ఇంగ్లిష్‌లో పెట్టిన క్యాప్షన్ ఇలా ఉంది.. "మా అమ్మ నీకు ఏమవుతుంది? మా నాన్న నీకు ఎలా బంధువు అవుతారు? అసలు నువ్వు, నేను ఎలా కలుసుకున్నాం? కానీ ప్రేమలో మాత్రం మన మనసులు ఎర్రటి నేల, కురిసే వర్షంలాంటివి: విడిపోకుండా ఎప్పటికీ కలిసే ఉంటాయి" అని అనడం విశేషం. శోభిత షేర్ చేసిన చిత్రాలలో, శోభిత, చైతూ నవ్వుతున్నట్లు చూడవచ్చు.

Sobhita Dhulipala
Sobhita Dhulipala



శోభిత ధూళిపాళ ఏపీలోని తెనాలికి చెందినది. 1992 మే 31న జన్మించింది. శోభితా తండ్రి వేణుగోపాల్ రావు ఒక నేవీ ఇంజినీర్. తల్లి శాంతా కామాక్షి ప్రైమరీ స్కూల్ టీచర్. విశాఖపట్నంలో పెరిగిన శోభితా 16 ఏళ్ల వయసులో తండ్రి వృత్తి రీత్యా ముంబైకి వెళ్లాల్సి వచ్చింది. 
 
అక్కడ ముంబై యూనివర్సిటీలో కార్పొరేట్ లా చేసిన శోభితా భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంది. 2010లో జరిగిన నేవీ వార్షిక వేడుకల్లో నేవీ క్వీన్‌ కిరీటం సాధించింది శోభిత.