శనివారం, 14 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2024 (09:25 IST)

నేడు శోభితా ధూళిపాళతో నాగ చైతన్య నిశ్చితార్థం?!

naga chaitanya - shobita
టాలీవుడ్ హీరోయిన్ సమంతతో విడాకులు అనంతరం వైవాహిక బంధానికి దూరంగా హీరో నాగ చైతన్య ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా ఆయన నటి శోభితా ధూళిపాళతో ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో వీరిద్దరూ కలిసి కలిసి లండన్ టూర్‌కు వెళ్లివచ్చారు. ఆ సమయంలో వీరిద్దరు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌తో పాటు చర్చనీయాంశమయ్యాయి కూడా. 
 
ఇపుడు వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటికానున్నారు. నాగ చైతన్య, శోభితలు అతి త్వరలో వివాహం చేసుకోబోతున్నారంటూ టాలీవుడ్ ఫిల్మ్ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం వారిద్దరూ గురువారం నిశ్చితార్థం చేసుకోబోతున్నారని సమాచారం. అయితే, వీరి పెళ్లి గురించిన వివరాలను, నిశ్చితార్థానికి సంబంధించిన చిత్రాలను హీరో అక్కినేని నాగార్జున చేస్తారని భావిస్తున్నారు.