ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2024 (22:42 IST)

సమంత-చైతూ గురించి శోభితా ధూళిపాళ ఏం చెప్పిందో తెలుసా?

Samantha
నాగచైతన్య-శోభితా ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ సందర్భంగా నాగ చైతన్య-సమంతల గురించి శోభితా చేసిన కామెంట్లకు సంబంధించిన పాత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ ఇంటర్వ్యూలో సమంత గురించి అడిగినప్పుడు, శోభిత మాట్లాడుతూ "ఆమె ఫిల్మోగ్రఫీ, కెరీర్ అద్భుతంగా ఉన్నాయి. ఆమె ఎంచుకుంటున్న పాత్రలు మెచ్చుకోదగినవి. ఆమె అగ్రనటిగా రాణిస్తోంది." అంటూ చెప్పుకొచ్చింది. 
 
అలాగే నాగ చైతన్య గురించి శోభిత మాట్లాడుతూ "అతను చాలా ప్రశాంతంగా, కంపోజ్ చేసిన వ్యక్తి. జీవితం పట్ల అతని కంపోజ్డ్ అప్రోచ్ నాకు నచ్చింది" అంటూ వెల్లడించింది. ప్రస్తుతం తెలుగు సోషల్ మీడియాలో నాగ చైతన్య, సమంత, శోభిత ముగ్గురి పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి.