బుధవారం, 11 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2024 (17:38 IST)

సమంత కంటే శోభిత జాతకం ఏమాత్రం బాగోలేదు : వేణు స్వామి

Naga Chaitanya
టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత జాతకం‌ విడాకుల వ్యవహారంతో వేణు స్వామి పాపులర్ అయ్యారు. తాజాగా హీరో నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ నిశ్చితార్థం గురువారం జరిగిన విషయం తెలిసిందే. అది జరిగిన వెంటనే నాగ చైతన్య, శోభిత ధూళిపాల వైవాహిక జీవితం ఎలా ఉంటుందో తాను చెబుతానని వేణు స్వామి ఓ పోస్ట్ చేశారు. శుక్రవారం వీరిద్దరి జాతకంపై వీడియో రిలీజ్ చేశారు. 
 
వీరిద్దరి జాతకం ఏమాత్రం బాలేదంటూ కామెంట్స్ చేశారు. సమంత కంటే శోభిత జాతకం ఏమాత్రం బాగాలేదని ఆయన చెప్పారు. అలాగే మూడేళ్ల తర్వాత చైతూ, శోభితకు ఒక స్త్రీ మూలంగా సమస్యలు, గొడవలు వస్తాయంటూ జోస్యం చెప్పారు. వీరిద్దరి నిశ్చితార్థ ముహూర్తం, ఈ ఇద్దరి పుట్టిన నక్షత్రం, ఇతర వివరాలు చూస్తుంటే వారు ఏమాత్రం కలిసి ఉండలేరని, ఖచ్చితంగా విడిపోతారని వేణు స్వామి జోస్యం చెప్పారు. 
 
వారు నిశ్చితార్థం చేసుకున్న ముహుర్తం ఎలాంటి అది అని గల్లీ జ్యోతిష్యుడు కూడా చెప్పగలడన్నారు. వీరి నిశ్చితార్థం ఉత్తర నక్షత్రంలో జరిగింది. నాగ చైతన్య రాశి కర్కాటక రాశి. శోభిత ధూళిపాళది ధనుస్సు రాశి. నాగ చైతన్యకు 6, శోభితకు 8 పాయింట్లు వచ్చాయి. ఇద్దరి జాతకాల్లో షష్టాకాలు వచ్చాయని ఆయన తెలిపారు.