1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Bigg Boss 11 Sabyasachi Satpathy SwayamVaram for Gay Bride

'గే' వరుడు కోసం స్వయంవరం.. టీవీ షోలో సంచలనం

దేశంలో స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తరహా శృంగారాన్ని నేరంగా పరిగణించే సెక్షన్‌ను అపెక్స్ కోర్టు కొట్టివేసింది. దీంతో స్వలింగ సంపర్కులు పండగ చేసుకున్నారు. ఈ తీర్పుతో కొం

Bigg Boss 11
దేశంలో స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తరహా శృంగారాన్ని నేరంగా పరిగణించే సెక్షన్‌ను అపెక్స్ కోర్టు కొట్టివేసింది. దీంతో స్వలింగ సంపర్కులు పండగ చేసుకున్నారు. ఈ తీర్పుతో కొందరు స్వలింగ సంపర్కులు వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
 
ఈ నేపథ్యంలో భారత టెలివిజన్ రంగంలో సంచలనం నమోదు కాబోతోంది. హిందీ బిగ్‌బాస్ సీజన్-11 కంటెస్టెంట్ సవ్యసాచి సత్పతి ప్రపంచాన్ని తనవైపు తిప్పుకునే షో‌తో టీవీ తెరపై కనిపించనున్నాడు. సరైన 'గే వరుడి'ని ఎంచుకునేందుకు ఓ టీవీ చానల్‌లో 'స్వయంవరం' షోను నిర్వహించనున్నాడు.
 
గతంలో బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కూడా అందమైన వరుడు కోసం స్వయంవరం పేరుతో ఓ షో నిర్వహించింది. కానీ, ఇపుడు నిర్వహించేది సంచలనంగా మారనుంది. ఇది పూర్తిగా స్వలింగ సంపర్కుల కోసం ఉద్దేశించింది. షోలో పాల్గొన్న వారి నుంచి సవ్యసాచి తనకు నచ్చిన వరుడిని ఎంచుకోనున్నాడు. ఈ విషయాన్ని సవ్యసాచి నిర్ధారించాడు. స్వయంవరం నిజమేనని, ఇందుకోసం ప్రొడక్షన్ హౌస్‌లు, టీవీ చానళ్లతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపాడు.
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అయోధ్యలో రామమందిరం ఖాయం.. సుప్రీం కోర్టు మనదే.. ముకుత్ బిహారీ వర్మ