శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 28 అక్టోబరు 2017 (13:35 IST)

దర్శకులు హీరోయిన్లను బరువు పెరగమంటారు: హీనా ఖాన్

హిందీ 'బిగ్ బాస్ - 11' షోలో కంటెస్ట్ అయిన నటి హీనా ఖాన్ దక్షిణాది హీరోలు, హీరోయిన్లపై నోరు పారేసుకున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ఇపుడు కలకలం రేపుతున్నాయి.

హిందీ 'బిగ్ బాస్ - 11' షోలో కంటెస్ట్ అయిన నటి హీనా ఖాన్ దక్షిణాది హీరోలు, హీరోయిన్లపై నోరు పారేసుకున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ఇపుడు కలకలం రేపుతున్నాయి. 
 
నిజానికి ఈ అమ్మడు సినిమాలైతే చేయలేదు కానీ, 'యే రిస్తా క్యా కెహల్తా హై' అనే హిందీ సీరియల్‌లో నటించింది. తర్వాత 'ఖత్రోంకీ ఖిలాడీ' అనే యాక్షన్ టీవీ కార్యక్రమంలో పాల్గొంది. దాంతో ఆమెకు బిగ్ బాస్‌లో అవకాశం వచ్చింది. 
 
తాజాగా ఆమె మాట్లాడుతూ, దక్షిణాదిలో బబ్లీ హీరోయిన్లను బాగా ఇష్టపడతారని తెలిపింది. అక్కడి దర్శకులు కూడా హీరోయిన్లను బరువు పెరగమంటారని చెప్పుకొచ్చింది. తనను బరువు పెరగమనడంతో రెండు సినిమా అవకాశాలు వదిలేశానని తెలిపింది. చీరలు కట్టుకుని అటూ ఇటూ గెంతమంటారని వ్యాఖ్యానించింది.
 
తెలుగులో వచ్చిన 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో హీరో వెంకటేష్ సరసన నటించే అవకాశం వచ్చిందన్నారు. అలాగే 'అనారీ' ('చంటి') సినిమాలో కరిష్మాకపూర్ సరసన నటించిన హీరోయే వెంకటేష్ అని ఆ షోలో గుర్తు చేసుకుంది. ఆ సినిమా ఆఫర్‌ను అనవసరంగా వదిలేశానని ఆవేదన వ్యక్తం చేసింది.