శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 28 అక్టోబరు 2017 (08:50 IST)

అట్టహాసంగా రజనీకాంత్ "2.O" చిత్రం ఆడియో రిలీజ్

సూపర్ స్టార్ రజనీకాంత్‌ కథానాయకుడిగా ఎస్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్ర "2.ఓ". అమీజాక్సన్‌ కథానాయిక. లైకాప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీత బ

సూపర్ స్టార్ రజనీకాంత్‌ కథానాయకుడిగా ఎస్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్ర "2.ఓ". అమీజాక్సన్‌ కథానాయిక. లైకాప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీత బాణీలు సమకూర్చారు. 
 
ఈ చిత్రం ఆడియో వేడుక శుక్రవారం రాత్రి దుబాయ్‌లో పాటల విడుదల వేడుక అట్టహాసంగా జరిగింది. భారీ హంగుల మధ్య జరిగిన ఈ వేడుకకి ఏ.ఆర్‌.రెహ్మాన్‌ సింఫనీ ఆర్కెస్ట్రా సంగీత ప్రదర్శనతో పాటు, బాస్కో బృందం నృత్య ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 
 
‘2.ఓ’ పాటల విడుదల సందర్భంగా దుబాయ్‌ నగరంలో ఎక్కడ చూసినా ఆ సినిమా పోస్టర్లే దర్శనమిచ్చాయి. స్కై డైవ్‌ చేస్తూ పోస్టర్‌ని ప్రదర్శించడం ఆకట్టుకుంది. యువ కథానాయకుడు రానా, బాలీవుడ్‌ ప్రముఖుడు కరణ్‌జోహార్‌, తమిళ నటుడు ఆర్‌.జె.బాలాజీ వేడుకని హోస్ట్‌ చేశారు.