సంబంధిత వార్తలు
- చెంపదెబ్బ ఎఫెక్ట్.. అకాడమీ సభ్యత్వానికి రాజీనామా..విల్ స్మిత్
- పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం: మంత్రి రాజీనామా
- లైంగిక ఆరోపణల నేపథ్యంలో మంత్రిపదవిని త్యజించిన బీజేపీ నేత
- ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలకు ఆమోదం : మంచు విష్ణు నిర్ణయం
- బ్రిటన్ ఎంపీ డేవిడ్ అమీస్ దారుణ హత్య.. చర్చిలో ప్రార్థనలు చేస్తుండగా..
మహిళా ఉద్యోగుల మధ్య కూర్చుని పోర్న్ వీడియోలు చూసిన ఎంపి
మహిళా ఉద్యోగుల మధ్యన కూర్చుని పోర్న్ వీడియోలు చూశాడు ఓ ఎంపి. హౌస్ ఆఫ్ కామన్స్‌లో తాను రెండుసార్లు అశ్లీల చిత్రాలు చూశానని అంగీకరించాడు బ్రిటిష్ ఎంపీ నీల్ పారిష్. ఈ కారణంగా అతడు తన ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు బీబీసీ నివేదించింది.
పారిష్ - డెవాన్‌లోని టివర్టన్, హోనిటన్‌ల ఎంపీ. అతను చేసినది క్షమించరానిదని కన్జర్వేటివ్ పార్టీ వెల్లడించింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయగా దానిపై అతడు స్పందిస్తూ... "నేను చేస్తున్న దాని గురించి నేను గర్వపడలేదు" అని చెప్పాడు.
మొదటిసారి వీడియో చూసినప్పుడు అది ప్రమాదవశాత్తూ జరిగిందని అతను అంగీకరించాడు, కానీ రెండవసారి ఉద్దేశపూర్వకంగానే చూసినట్లు చెప్పాడు, అయితే అతను చేసింది ఖచ్చితంగా తప్పు అని ఒప్పుకున్నాడు.
ఈ ఆరోపణలపై శుక్రవారం కన్జర్వేటివ్ పార్టీ పారిష్‌ను సస్పెండ్ చేసింది. ఇద్దరు మహిళా సహోద్యోగులు అతను తమ దగ్గర కూర్చొని తన ఫోన్‌లోని అడల్ట్ కంటెంట్‌ను చూడటం తాము చూశామని పేర్కొన్నారు.
తన కుటుంబం, తన నియోజకవర్గం పరిధి ప్రజలు పారిష్ చేసిన పనికి తలదించుకుంటున్నామని తెలిపారు. దీనితో అతడు భావోద్వేగానికి గురయ్యాడు. "నేను తప్పు చేసాను, నేను తెలివితక్కువవాడిని, నేను తెలివిని కోల్పోయాను" అని అతను చెప్పాడు. కానీ తను చూస్తున్న పోర్న్ వీడియోలు ఇతరులు చూసేట్లు ప్రోత్సాహించాడన్న వ్యాఖ్యలను ఖండించాడు.
తర్వాతి కథనం
