శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 డిశెంబరు 2021 (12:36 IST)

ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలకు ఆమోదం : మంచు విష్ణు నిర్ణయం

ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు జరిగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున గెలుపొందిన సభ్యులు చేసిన రాజీనామాలను 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు ఆమోదిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే, నటులు ప్రకాష్ రాజ్, నాగబాబులు తమతమ 'మా' ప్రాథమిక సభ్యత్వానికి చేసిన రాజీనామాలను మాత్రం ఆయన ఆమోదించలేదు. 
 
"మా ఎన్నికల్లో గెలుపొందిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు ఆమోదించారు. ప్రకాష్ రాజ్ నుంచి శ్రీకాంత్, ఉత్తేజ్‌తో సహా మొత్తం 11 మంది సభ్యులు రాజీనామాలు చేశారు. వీరందరినీ రాజీనామాలు చేయొద్దని, రాజీనామాలు వెనక్కి తీసుకోవాలని విష్ణు కోరారు. కానీ, వారు పట్టించుకోలేదు. దీంతో ఆ రాజీనామాలపై మంచు విష్ణు ఆమోదముద్ర వేశారు. అదేసమయంలో మా ప్రాథమిక సభ్యత్వానికి చేసిన రాజీనామాలను మాత్రం ఆయన ఆమోదించలేదు.