బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 9 డిశెంబరు 2021 (21:17 IST)

క్షమించమ్మా, బాధపడుతున్నా, మీ పిల్లల్ని నేను చదివిస్తానన్న మంచు విష్ణు

విధి నిర్వహణలో మృతి చెందిన జవాను సాయితేజ కుటుంబ సభ్యులను మా అధ్యక్షుడు, శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్ధల సిఈఓ మంచు విష్ణు పరామర్సించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని ఎస్‌బిఐ కాలనీలో ఉంటున్న సాయితేజ సతీమణి శ్యామలకు ఫోన్ చేసి మాట్లాడారు.

 
యుక్త వయస్సులోనే దేశ భద్రతను రక్షించే అత్యంత గొప్పదైన సిడీఎస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉన్న సాయితేజ అకాల మరణం పొందడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. సాయితేజ ఇద్దరు పిల్లలు మోక్షజ్ఞ, దర్సినిలను తన స్వంత బిడ్డలుగా సంరక్షిస్తానని హామీ ఇచ్చారు.

 
ఇద్దరినీ తమ సొంత విద్యాసంస్థ విద్యానికేతన్‌లో ఉచితంగా చదివిస్తానని హామీ ఇచ్చారు. 10 రోజుల్లో మదనపల్లికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడుతానని సాయితేజ భార్య శ్యామలకు హామీ ఇచ్చారు మంచు విష్ణు.