బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 9 డిశెంబరు 2021 (18:49 IST)

అమ్మా... ఇంతమంది మనింటికి ఎందుకు వచ్చారు? తండ్రి సాయితేజ మరణించిన విషయం తెలియక..?

అమ్మా.. మన ఇంటికి ఇంతమంది బంధువులు ఎందుకు వస్తున్నారమ్మా.. మనింట్లో ఫంక్షన్ ఏమైనా ఉందా.. సరే అమ్మా... నేనెళ్ళి ఆడుకుంటాం.. నేను బయటే ఉంటాను. నన్ను పిలువు అంటూ ఆ చిట్టి తండ్రి చెప్పే మాటలు విన్న తల్లికి కన్నీరు ఆగలేదు. తండ్రి చనిపోయాడయ్యా అని చెప్పినా ఆ చిన్నారికి ఏంటో తెలియని పరిస్థితి. 

 
ఈ హృదయ విదాకరమైన సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. చనిపోయిన వ్యక్తి ఆర్మీ అధికారి సాయితేజ. నిన్న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు సాయితేజ. మృతదేహాలు మొత్తాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళారు. అయితే సాయితేజ మృతదేహాం రేపు స్వస్థలానికి రాబోతోంది. 

 
డిఫెన్స్ చీఫ్ రావత్‌తో కలిసి హెలికాప్టర్‌లో ప్రయాణించే సమయంలో చనిపోయాడు సాయితేజ. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో బంధువులందరూ సాయితేజ స్వస్థలం చిత్తూరు జిల్లాలోని కురబలకోట మండలంలోని రేగడు ప్రాంతానికి వస్తున్నారు.