శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 డిశెంబరు 2021 (10:41 IST)

46 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ వైరస్ - మృతుల సంఖ్య ఎంత?

సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వైరస్ మెల్లగా ఒక్కో దేశానికి వ్యాపిస్తోంది. అలా ఇప్పటివరకు ఏకంగా 46 దేశాలకు వ్యాపించింది. ఇపుడిపుడే డెల్టా వేరియంట్ నుంచి కోలుకుంటున్న ప్రజలకు ఇపుడు కొత్తగా ఒమిక్రాన్ వైరస్ దడపుట్టిస్తుంది. ఆరంభంలో సౌతాఫ్రికాలో ఉన్న ఈ వైరస్.. ఆ తర్వాత 38 దేశాలకు వ్యాపించింది. ఈ సంఖ్య సోమవారానికి 46కు చేరింది. ఇందులో భారత్ కూడా కూడా వుంది. భారత్‌లో ఇప్పటికే 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
అలాగే, ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 941కు చేరింది. వీటిలో బ్రిటన్‌లో 246, సౌతాఫ్రికాలో 228, జింబాబ్వేలో 50, అమెరికాలో 39, భారత్‌లో 21 చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఆదివారం ఒక్కరోజే ఏకంగా 17 కేసులు నమోదయ్యాయి. అయితే, ఒమిక్రాన్ వైరస్ బారినపడి చనిపోయినట్టు ఎక్కడా కూడా నమోదు కాలేదు. 
 
మరోవైపు, ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మరింతగా దృష్టిసారించింది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు రాసింది.