గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 డిశెంబరు 2021 (13:18 IST)

టెక్కీతో భార్య అక్రమ సంబంధం... భర్తను హత్య చేసి...

వయస్సులో తనకంటే చిన్నవాడైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో ఓ వివాహిత అక్రమం సంబంధం పెట్టుకుంది. ఈవిషయం భర్తకు తెలియడంతో అతన్ని మట్టుబెట్టింది. ఆ శవాన్ని మాయం చేసేందుకు గోనె సంచిలో మూటగట్టి కారు డిక్కీలో వేసుకుని ప్రియుడితో కలిసి భార్య పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడం సంచలనం రేపింది. 
 
ఈ దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌కు సమీపంలో ఉన్న కటారా హిల్స్ అనే ఏరియాలో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన ధన‌రాజ్ మీనా (40) అనే వ్యక్తి కొన్నేళ్ళ క్రితం సంగీతా మీనా (34) అనే వ్యక్తిని వివాహం చేసుకున్నాడు. పగలు భర్త పనికి వెళితే మీనా మాత్రం ఒంటరిగా ఇంట్లో ఉండేది. 
 
ఈ క్రమంలో అదే ప్రాంతంలోని సాగర్ గోల్డెన్ పార్క్‌ కాలనీకి చెందిన ఆశీష్ పాండే (32) అనే టక్కీతో అక్రమ సంబంధం పెట్టుకుంది. వయసులో తనకంటే చిన్నవాడైనప్పటికీ రంకుబాగోతం సాగించింది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆయన భార్యను మందలించాడు. 
 
అయితే, తమ అక్రమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన సంగీతా.. తన ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టింది. భర్తకు నిద్రమాతలు ఇచ్చిన తలపై సుత్తితో కొట్టి చంపేసింది. ఆ తర్వాత శవాన్ని కారు డిక్కీలో వేసుకుని నేరుగా ఠాణాకు వెళ్లి లొంగిపోయారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి వారిద్దరిని అరెస్టు చేశారు.