సంబంధిత వార్తలు
- Pongalకి మాత్రమే సెలవులా? ఇడ్లీ, వడకి?
- రామునికి అగస్త్యుడు ఉపదేశించిన "ఆదిత్య హృదయం" స్తోత్రము.. రథసప్తమి రోజున? (video)
- ఓం యక్షాయ కుబేరాయా.. అంటూ ఈ శ్లోకం జపిస్తే... (Video)
- శుక్రవారం చంద్రగ్రహణం, ఈ శ్లోకం, ఈ నియమాలు పాటిస్తే చాలు
- ఖాకీలపై నిన్న రాళ్ళు.. నేడు పూల వర్షం .. ట్రెండింగ్‌లో హైదరాబాద్ పోలీసులు టాప్
కరోనా వైరస్‌కు చెక్ పెట్టే మంత్రం..''ఓం తారే తుత్తారే తురే సోహా'': దలైలామా (video)
చైనాను మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తిస్తున్న కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు బౌద్ధ మత గురువు దలైలామా ఓ మంత్రాన్ని ఉచ్ఛరించాలని పేర్కొనడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. చైనాలో కరోనా వైరస్ కారణంగా మరణించేవారి సంఖ్య వందకు పైగా పెరిగిపోతోంది. అలాగే ఐదువేల మందికి పైగా కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
ఈ వైరస్ ధాటికి జనాలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ వైరస్‌కు ఇంకా మందులు కనిపెట్టేందుకు వైద్యులు, పరిశోధకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు చైనీయులు ఓ మంత్రాన్ని ఉచ్ఛరించాలని బుద్ధ మత గురువు దలైలామా తెలిపారు.
దీనిపై తన ఫేస్‌బుక్‌లో ఈ మంత్రాన్ని పోస్టు చేశారు. ''ఓం తారే తుత్తారే తురే సోహా'' అనే మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ వుంటే కరోనా వైరస్ వ్యాపించదని పేర్కొన్నారు. దలైలామా పేర్కొన్న ఆ మంత్రం ప్రస్తుతం చైనాలో వైరల్ అవుతోంది.
