1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Delivery man bravely protects woman, her baby during lift malfunction

లిఫ్టులో చిక్కుకున్న తల్లీబిడ్డను కాపాడిన కొరియర్ బాయ్

Lift
Lift
కొందరు ఆపదలో ఉన్నప్పుడు ఇతరులకు సహాయం చేయడానికి మొగ్గు చూపరు. అయితే లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన మహిళను చిన్నారిని ఓ కొరియర్ డెలివరీ చేసే యువకుడు రక్షించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. వీడియోలో, కొరియర్ డెలివరీ చేయడానికి వచ్చిన యువకుడు లిఫ్ట్‌లో ప్రయాణిస్తున్నాడు. ఓ మహిళ తన చిన్నారితో కలిసి లిఫ్ట్‌లో ప్రయాణిస్తోంది. 
 
అప్పుడు అకస్మాత్తుగా లిఫ్ట్ సగంలో ఆగిపోతుంది. దీంతో ఆ మహిళ కంగారుపడుతుంది. ఇది చూసిన కొరియర్ ఉద్యోగి మహిళ భయాన్ని పోగొట్టడానికి పసికందును, మహిళను రక్షించడానికి ప్రయత్నించాడు. తలుపు తెరవడానికి లిఫ్ట్ బటన్‌ను నొక్కాడు.
 
ఆమె సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత, లిఫ్ట్ డోర్ తెరుచుకుంటుంది. ఆపై తల్లి, బిడ్డ సురక్షితంగా బయటకు రావడం కనిపించింది. ఈ వీడియోను 30 లక్షల మందికి పైగా వీక్షించారు. లిఫ్టులో బిడ్డను-తల్లికి కాపాడిన కొరియన్ ఉద్యోగిని కొనియాడుతూ కొందరు యూజర్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
తర్వాతి కథనం
చైనాలో భారీ వర్షాలు- 80 మంది మృతి.. 16మంది గల్లంతు