శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జులై 2023 (20:59 IST)

టీ-10 క్రికెట్ ఫార్మాట్‌- పాక్ బౌలర్ హఫీజ్ రికార్డ్

Pak Bowler
Pak Bowler
టీ-10 క్రికెట్ ఫార్మాట్‌లో ఆరు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా పాక్ స్టార్ హఫీజ్ రికార్డు సృష్టించాడు. జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ జింబాబ్వేలో జరుగుతోంది. ఈ టోర్నీలో జోబర్గ్ బఫెలోస్‌కు మహ్మద్ హఫీజ్ ప్రాతినిథ్యం వహించాడు. 
 
జూలై 21న బులవాయో బ్రేవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇచ్చిన ఆరు పరుగులు కూడా ఒకే ఓవర్‌లో కావడం గమనార్హం. 
 
మరో ఓవర్‌లో మూడు వికెట్లు తీయగా, ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ బఫెలోస్ నిర్ణీత 10 ఓవర్లలో 105 పరుగులు సాధించగా, బులవాయో బ్రేవ్స్ 95 పరుగులకే పరిమితం అయ్యింది.