సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 మార్చి 2023 (08:53 IST)

డబ్ల్యూపీఎల్‌: విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు

Mumbai Indians
Mumbai Indians
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్ మహిళల జట్టు విజేతగా నిలిచింది. భారత్‌లో తొలిసారిగా నిర్వహించిన ఈ పోటీల్లో ముంబై ఇండియన్స్ గెలుపును నమోదు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఫైనల్‌లో తలపడిన ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 
 
132 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నాట్ షివర్ 60 పరుగులతో అదరగొట్టింది. 55 బంతులు ఎదుర్కొన్న షివర్ 7 బౌండరీలు బాదింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 37 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌తో గెలుపును నమోదు చేసుకుంది. 
 
లక్ష్య చేధనలో 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్‌ను నాట్ షివర్, హర్మన్ ప్రీత్ జోడీ ఆదుకుంది. హర్మన్ ప్రీత్ అవుటైనా, మీలీ కెర్ (14 నాటౌట్) సహకారంతో నాట్ షివర్ మిగతా పని పూర్తి చేసింది. 
 
అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసింది.