బుధవారం, 6 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఇండరో టెస్ట్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన భారత్

India vs Australia
ఇండోర్ వేదికగా జరిగిన ముడో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు చిత్తుగా ఓడింది. ఆస్ట్రేలియా విసిరిన స్పిన్ వలో చిక్కుకుని ఓటమి పాలైంది. ఫలితంగా బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు మూడో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఫలితంగా భారత్ ఆధిక్యాన్ని 2-0 నుంచి 2-1కు తగ్గించింది. 
 
తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో స్పిన్ అస్త్రంతో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించిన భారత్ ఇపుడు అదే స్పిన్ అస్త్రంలో చిక్కుకుంది. ఫలితంగా మూడో టెస్ట్ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్ నిర్ధేశించిన 76 పరుగుల విజయలక్ష్యాన్ని మూడో రోజు శుక్రవారం ఉదయం ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది.
 
ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (0)ను అశ్విన్ ఔట్ చేసి భారత శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. కానీ, మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (49 నాటౌట్), మార్నస్ లబుషేన్ (28 నాటౌట్) వన్డే స్టయిల్లో బ్యాటింగ్ చేసి భారత ఆశలపై నీళ్లు కుమ్మరించాడు. రెండో వికెట్‌కు అజేయంగా 77 పరుగులు జోడించి ఆసీస్‌ను గెలిపించారు. 
 
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 109 పరుగులకు ఆలౌట్ అవగా.. అంతకుముందు ఆస్ట్రేలియా 197 స్కోరు చేసి 88 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 163 పరుగులకే కుప్పకూలి ప్రత్యర్థికి చిన్న లక్ష్యాన్ని మాత్రమే ఇచ్చింది.