శుక్రవారం, 3 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2023 (12:49 IST)

అనిల్ కుంబ్లే రికార్డు బద్ధలు... 112 వికెట్లు తీసిన లియోన్

anil kumble
భారత క్రికెట్ దిగ్గజం, స్పిన్ మాంత్రికుడు అనిల్ కుంబ్లే రికార్డు మాయమైంది. ఆయన రికార్డును ఆస్ట్రేలియా క్రికెటర్ లియోన్ బద్ధలు కొట్టాడు. ప్రస్తుతం భారత పర్యటనలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఉన్న లియాన్ ఈ రికార్డును మాయం చేశాడు. 
 
నిజానికి ప్రపంచ దిగ్గజ స్పిన్నర్లలో లియోన్ ఒకరు. ఆయన తన కెరీర్‌లో ఎన్నో రికార్డులను సాధించారు. భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా కూడా ఉన్నారు. అలాగే, టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన ఘనతను సొంతం చేసుకున్నాడు. 
 
అలాంటి దిగ్గజ క్రికెటర్ పేరుమీద ఉన్న రికార్డును లియోన్ మాయం చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు 112 వికెట్లు తీసి... ఈ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఇప్పటివరకు ఆ రికార్డు అనిల్ కుంబ్లే (111 వికెట్లు) పేరు మీద ఉంది. భారత్‍‌తో జరుగుతున్న టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ఉమేశ్ యాదవ్ వికెట్ తీసిన లియోన్ ఆ ఘనతను సాధించాడు. 
 
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..
నాథన్ లియోన్ 112 వికెట్లు
అనిల్ కుంబ్లే 111 వికెట్టు
అశఅవిన్ 106 వికెట్లు
హర్భజన్ సింగ్ 95 వికెట్లు,
రవీంద్ర జడేజా 84 వికెట్లు