మంగళవారం, 16 జులై 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2023 (23:31 IST)

ఆస్ట్రేలియా ఓపెన్‌లో సానియా జోడీ ఓటమి.. కంటతడి.. వీడియో వైరల్

sania mirza
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్‌కు బైబై చెప్పేందు చాలా దగ్గరలో వుంది. మెల్‌బోర్న్‌లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్- 2023 ఫైనల్‌ పోరులో సానియా-బోపన్న జోడి పరాజయం పాలైంది. దీంతో గ్రాండ్ స్లామ్ కెరీర్‌ను విజయంతో ముగించాలనుకున్న సానియా జోడీకి నిరుత్సాహం తప్పలేదు. 
 
ఫైనల్‌లో  సానియా-బోపన్న జోడీ వరుస సెట్లలో ఓడిపోయింది. 7-6(2), 6-2 తేడాతో బ్రెజిల్ జోడీ లూయిసా స్టెఫానీ, రఫెల్ మాటోస్ చేతిలో ఖంగుతింది. ఈ మ్యాచ్ తర్వాత సానియా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఇకపోతే... ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ ముగించిన సానియా వచ్చే నెలలో జరగనున్న దుబాయ్‌ ఓపెన్‌లో ఆడనుంది. అదే తన ప్రొఫెషనల్ టెన్నిస్‌ కెరీర్‌కు ఆఖరి టోర్నమెంట్‌. దీంతో ఫిబ్రవరి చివరి నాటికి సానియా మీర్జా తన టెన్నిస్ కెరీర్‌కు గుడ్ బై చెప్తారు.