గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 ఫిబ్రవరి 2023 (17:02 IST)

బోరున విలపించిన కోటంరెడ్డి గన్‌మెన్లు

kotamreddy gunmens
వైకాపా రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన గన్‌మెన్లను వెనక్కి పంపించారు. ఈ నిర్ణయాన్ని మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న ఇద్దరు గన్‌మెన్లు బోరున విలపించారు. కోటంరెడ్డిని వదిలి వెళ్లలేక తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. 
 
దీంతో కోటంరెడ్డి కూడా చలించిపోయారు. ఇద్దరు గన్‌మెన్లను దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. కాగా, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికార వైకాపాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే. పైగా, తన గన్‌మెన్లను వెనక్కి ఇచ్చేయాలన్న తన ప్రకటనను సినిమా డైలాగు అనుకోవద్దని తగ్గేదే లే అని తన వైఖరిని బలంగా చాటిచెప్పారు.