శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (11:38 IST)

కొత్త సచివాలయంలో జరిగింది అగ్నిప్రమాదం కాదు.. మాక్ డ్రిల్

secretariat
తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయంలో జరిగింది అగ్నిప్రమాదం కాదని అది మాక్ డ్రిల్ అని తెలంగాణ ప్రభుత్వ అధికారులు అంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఏ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయనే దానిపై స్పష్టత లేదు. అయితే, ఈ మంటలను 11 అగ్నిమాపకదళ బృందాలతో వచ్చిన సిబ్బంది అదుపు చేశాయి. అలాగే, సచివాలయం సమీపంలోకి పోలీసులు ఎవ్వరినీ అనుమతించలేదు. 
 
మరోవైపు ప్రమాదం ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోయర్ గ్రౌండ్‌లో ఫ్లోర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించాయని కొందరు అంటున్నారు. ముఖ్యంగా, ఐదు, ఆరు అంతస్తుల్లో మంటలు అంటుకున్నాయని, మరికొందరు చెబుతున్నారు. అగ్నిమాపకదళ శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి కూడా ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే, అగ్నిప్రమాదంపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. 
 
కానీ, జరిగింది అగ్నిప్రమాదం కాదని, కేవలం మాక్ డ్రిల్ అని చెప్పారు. సచివాలయ భద్రతా సిబ్బంది కూడా మాక్ డ్రిల్‌లో భాగంగా మంటలు వచ్చాయని అంటున్నారు. దాంతో జరిగింది అగ్నిప్రమాదమా? కాదా? అనే అంశంపై స్పష్ట లేదు. ఈ ప్రమాదం కారణంగా వచ్చిన దట్టమైన పొగల ధాటికి సచివాయల వెనుక భాగంలోని ఓ గుమ్మటం నల్లగా మారిపోయింది.