1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Derababa enjoy with Honipreet in quarantine, police persons as safeguards?

క్వారంటైన్‌లో ప్రియురాలితో డేరాబాబా ఎంజాయ్, పోలీసుల కాపలా..?

Derababa
అత్యాచారం కేసులతో హత్యా యత్నాల్లో 20 యేళ్ళ శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా ఎట్టకేలకు అనారోగ్యం సాకుతో కార్పొరేట్ ఆసుపత్రిలో తన ప్రియురాలు హనీప్రీత్‌తో సరసాల్లో మునిగితేలుతున్నాడట. డబ్బుంటే జైలైనా, ఆసుపత్రి అయినా సర్వసుఖాలు దక్కుతాయి అనడానికి ఇదే నిదర్సనం కాబోలు అనుకుంటున్నారు.
 
ఆధ్యాత్మిక ముసుగులో వేలకోట్ల రూపాయల సంపాదించిన డేరాబాబా హనీప్రీత్ తన దత్తకుమార్తె అంటూ ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. భార్యాబిడ్డలను కూడా వదిలేశాడు. ఈ నీచుడు రేప్ కేసులో జైలుకెళ్ళిన తరువాత ఇప్పుడు అనారోగ్యం సాకుతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడట.
 
తరువాత అక్కడ కరోనా పాజిటివ్ అని నిర్థారించారట. మెరుగైన వైద్యం అంటూ ఫైవ్ స్టార్ కార్పొరేట్ ఆసుపత్రి మేదాంతకు షిప్ట్ చేశారట. అక్కడ టెస్ట్ చేసి కోవిడ్ నెగిటివ్ అని తేల్చారట. ఈ రెండు టెస్టులకు మధ్య రెండు గంటలే తేడా అట. ఎలాగైతే ఏమి డేరాబాబా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళాడు.
 
మిగిలిన జబ్బులకు ఈ నెల 15వ తేదీ వరకు ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స చేయబోతున్నారట. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఆయనకు అటెండెంట్‌గా హనీప్రీత్ డేరా బాబా గదిలోకి అడుగుపెట్టేసిందట. ఇప్పుడు ఆసుపత్రి గదిలో ఇద్దరే ఉన్నారట. బయట పోలీసులు కాపలా ఉన్నారట. 
About Writer
జె
తర్వాతి కథనం
ఏపీ సీఎం జగన్‌కు ఆనందయ్య లేఖ.. మందు తయారీకి సహకరిచండి..