మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 1 అక్టోబరు 2020 (21:48 IST)

మద్యం తాగుతూ ప్రియుడితో ఎంజాయ్, బాటిల్‌తో అటువైపుగా వచ్చిన భర్త..?

ప్రతిరోజు తాగి వచ్చే భర్త. భర్త చేష్టలతో విసిగిపోయింది భార్య. అసలు మందులో ఏముంది అంత కిక్ అనుకుంది. అందుకే ఆమె కూడా ట్రై చేసింది. అది ఎవరితో తెలుసా తన ప్రియుడితో. మద్యం తాగడం శారీరకంగా కలవడం, ఇదే పనిగా పెట్టుకుంది. ఇలా చేస్తూ అడ్డంగా భర్తకే దొరికిపోయింది.
 
కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం చిన్నగుమ్మడాపురంలో నివాసముండే గంగయ్య, దుర్గమ్మకు పదేళ్ళ క్రితం వివాహమైంది. పిల్లలు లేరు. గంగయ్య మేస్త్రీ. దుర్గమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది. అయితే గంగయ్యకు రోజూ తాగి ఇంటికి రావడం అలవాటు.
 
ఎన్నో యేళ్ళుగా భరించింది. కరోనా సమయంలోను మద్యం మానలేదు. కొనసాగించాడు గంగయ్య. అస్సలు మద్యంలో ఏముందే తెలుసుకోవాలనుకుంది. తన ఇంటి పక్కనే ఉన్న భాస్కర్ అనే యువకుడితో అప్పటికే పరిచయం ఉంది దుర్గమ్మకు.
 
అతనితో మద్యం తెప్పించుకుంది. ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. మద్యం తాగి దుర్గమ్మ రెచ్చిపోయింది. ఇద్దరూ శారీరకంగా కలిశారు. ఇలా వీరి మధ్య శారీరక సంబంధం కొనసాగుతూ వచ్చింది. గత వారంరోజుల క్రితం భర్త గంగయ్య పని ముగించుకుని మద్యం కొనుగోలు చేశాడు.
 
తన ఇంటికి సమీపంలో ఒక ప్లాట్ దగ్గరకు వెళ్ళి తాగేందుకు వెళుతున్నాడు. అయితే ఆ ప్రాంతంలో అప్పటికే తన భార్య, భాస్కర్ కనిపించారు. దీంతో కోపంతో ఊగిపోయాడు. ఇద్దరిని చితకబాదాడు. దీంతో భార్యాభర్తలిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి.
 
నిన్న రాత్రి భర్త పెట్టే టార్చర్ భరించలేక దుర్గమ్మ ఎలాగైనా అతన్ని చంపేయాలనుకుంది. గంగయ్య స్నేహితులతోనే ఆమె సుపారీ కుదుర్చుకుంది. 3 లక్షలు ఇస్తానని చెప్పి మొదటగా లక్ష ముట్టజెప్పింది. దీంతో ముగ్గురు కలిసి గంగయ్యకు పీకల దాకా మద్యం తాగించారు.
 
దీంతో అతడు స్పృహ తప్పి పడిపోయాడు. అతడిని కారులో తీసుకెళ్ళి ఊరికి చివర కిరోసిన్ పోసి తగులబెట్టారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు ఆ శవం గంగయ్యదిగా గుర్తించారు. అతడి భార్యను విచారించడంతో అస్సలు విషయం బయటపడింది.