గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 1 అక్టోబరు 2020 (16:35 IST)

భర్త విదేశాల్లో ఉద్యోగం, భార్య ప్రియుడితో కలిసి ఎంజాయ్, ఇంటి యజమానురాలు చూసి?

భార్యను ఎంతో నమ్మాడు. ఆమే సర్వస్వం అనుకున్నాడు. భార్య, పిల్లలు కష్టపడకూడదని విదేశాలకు వెళ్ళి పనిచేయడం మొదలుపెట్టాడు. కష్టపడి డబ్బులు సంపాదించి డబ్బును భార్యకు పంపించేవాడు. పిల్లలను బాగా చదివించమని చెప్పాడు. అయితే ఆ భార్య మాత్రం భర్త నమ్మకాన్ని వమ్ము చేసింది. ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ చివరకు..
 
తమిళనాడు రాష్ట్రం నాగై జిల్లా సీర్గాళి ప్రభుత్వ పాఠశాలలో హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్న జ్యోతి తన ఇంటిలో ఒక పోర్షన్‌ను అద్దెకు ఇచ్చింది. రామ్, బృంద అనే భార్యాభర్తలిద్దరికీ ఇంటిని అద్దెకు ఇచ్చింది. రెండు సంవత్సరాలుగా వారు ఇక్కడే ఉంటున్నారు.
 
అయితే రామ్‌కు సింగపూర్‌లో ఉద్యోగం చేయడానికి అవకాశం రావడంతో సంవత్సరం ముందే అక్కడకు వెళ్ళాడు. బాగా సంపాదించి తిరిగి స్వస్థలానికి వచ్చి సెటిల్ అవుదామనుకున్నాడు రామ్.
 
తన కొడుకు, భార్యను ఇక్కడే వదిలి సింగపూర్లో పనిచేస్తూ డబ్బులను ఇంటికి పంపేవాడు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొడుకును చదివించమని చెప్పాడు. కానీ బృందం మాత్రం ఇంట్లో బోర్ కొడుతోందని కరోనా కన్నా ముందే ఒక ఇనిస్టిట్యూట్‌లో కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్ళింది.
 
ఆ ఇనిస్టిట్యూట్ యజమాని రియాజుద్దీన్, బృంద కళాశాల రోజుల్లో కలిసి చదువుకున్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు. బృంద భర్త విదేశాల్లో ఉండటం తెలుసుకున్న రియాజుద్దీన్ బృందను మెల్లగా లైన్లో పెట్టాడు. ఆమెతో శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడు.
 
నేరుగా బృందం ఇంటికే వెళ్ళి ఎంజాయ్ చేసేవాడు రియాజుద్దీన్. ఇది గత కొన్నినెలలుగా సాగుతోంది. విషయం కాస్తా ఇరుగుపొరుగు వారికి తెలిసింది. ఇంటి యజమాని జ్యోతి, బృందను హెచ్చరించారు. మొత్తం విషయాన్ని సింగపూర్లో ఉన్న భర్తకు చెప్పేస్తానని హెచ్చరించింది.
 
దీంతో బృంద భయపడింది. విషయం భర్తకు తెలియకుండా ఉండాలని రియాజుద్దీన్‌తో కలిసి జ్యోతి హత్యకు ప్లాన్ చేసింది. ఇంటి ముందు ముగ్గు వేస్తున్న జ్యోతిని రియాజుద్దీన్ తలపై రాడ్‌తో కొట్టి పరారయ్యాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది. 
 
మొదట్లో పోలీసులకు ఈ కేసును ఛేదించడం సవాల్‌గా మారినా సిసి కెమెరా ద్వారా రియాజుద్దీన్‌ను గుర్తించి అదుపులోకి తీసుకుంటే అసలు విషయం బయటపడింది. నిందితుడిని, బృందను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.