గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 28 సెప్టెంబరు 2020 (20:28 IST)

సరే, నా తమ్ముడితో పడుకో, భర్త ఆ మాట చెప్పగానే భార్య షాక్?

మీ తమ్ముడు లైంగికంగా వేధిస్తున్నాడు. కోరిక తీర్చమంటున్నాడు. వదిన అంటే తల్లితో సమానం. నేను ఎన్నోసార్లు చెప్పాను. అతను వినిపించుకోలేదు. మీరన్నా అతనికి మంచి బుద్ధి చెప్పండి అంటూ ఒక వివాహిత భర్తను ప్రాధేయపడింది. తమ్ముడిని దండించాల్సిన ఆ అన్న భార్యను వెళ్ళి తమ్ముడి దగ్గర పడుకోమన్నాడు. దీంతో భార్య షాక్‌కు గురైంది.
 
హర్యానాలోని కర్నాల్‌కు చెందిన నిఖిల్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన మరో యువతికి నాలుగు నెలల క్రితం వివాహమైంది. కరోనా సమయంలో నిబంధనలను పాటిస్తూ వివాహం చేసుకున్నారు. కొత్త జీవితం ఎంతో బాగుంటుందని ఆమె భావించింది.
 
కానీ ఆమెకు పుట్టింట్లో అన్నీ సమస్యలే. వచ్చిన నెల రోజుల నుంచి మరిది లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. మరిది కాబట్టి విషయం బయటకు చెబితే ఏమవుతుందోనని సందేహించింది. భర్తకు చెబితే గొడవలవుతుందని భరించింది. ఇలా మూడు నెలల పాటు సాగింది. కానీ గత రెండురోజుల నుంచి చోటు మరింత రెచ్చిపోయాడు.
 
దీంతో విషయాన్ని భర్తకు చెప్పేసింది. అయితే భర్త నుంచి అలాంటి సమాధానం వస్తుందని మాత్రం ఊహించలేదు ఆ భార్య. ఎందుకు ఆలోచిస్తున్నావు. వెళ్ళి ముందు మా తమ్ముడు చెప్పింది చెయ్యి అంటూ భర్త హుకూం జారీ చేశాడు. దీంతో ఆమె షాక్. ఏమీ అర్థం కాలేదు. 
 
మరోవైపు అదనపు కట్నం కోసం అత్త, మామల సాధింపు. దీంతో ఆ మహిళ తట్టుకోలేకపోయిది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అదనపు కట్నం వేధింపుల కేసులో అత్తమామలు, లైంగికంగా వేధిస్తున్నారని తమ్ముడు, భర్తను అరెస్టు చేసి కటాకటాల్లోకి నెట్టారు పోలీసులు.