స్విమ్ సూట్‌లో ఎంజాయ్ చేస్తున్న రకుల్, రాఖీ
ఇద్దరు నటీమణులు ఒకరు రకుల్ ప్రీత్‌సింగ్, మరొకరు రాశీ సావంత్. ఇద్దరు పేర్లలో ముందు ఆర్. వుండడమే కాకుండా ఒకే రోజు ఇద్దరూ తాము స్విమ్ దుస్తులు ధరించి తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం విశేషం. రకుల్‌ప్రీత్‌సింగ్ స్విమ్‌సూట్‌తో పూల్‌లో నిల్చొని ఫొటోకు పోజిచ్చింది. ప్రతిరోజూ తాను వాటర్‌బేబీనే అంటూ ట్వీట్ చేసింది.
రకుల్ రోజూవారీ వ్యాయాం చేయడం తెలిసిందే. తను ఏ ఊరిలో వున్నా వర్కవుట్‌కు ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తుంది. హైదరాబాద్‌లో కూడా ఆమె ఓ జిమ్‌ను నిర్వహిస్తుంది కూడా. ఇలా ఒక ఆరోగ్యం మరో వైపు సినిమాలు చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. తెలుగులో ఇంకా పేరు నిర్ణయించని ఓ పెద్ద సినిమాలో నటిస్తోంది. హిందీలో `సర్దార్ కా గ్రాండ్ సన్`తోపాటు మూడు సినిమాలు చేస్తోంది. తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది రకుల్.
ఇక రాఖీసావంత్ గురించి చెప్పక్కర్లేదు. ఆమధ్యనే తన తల్లికి అనారోగ్యం కావడంతో ప్రముఖులంతా స్పందించి ఆమెకు ధైర్యాన్ని నూరిపోశారు. ఇప్పుడు రిలీఫ్గా వున్న ఆమె తన వ్యక్తిగత కార్యకలాపాలపై దృష్టి పెట్టింది. అయితే పలు చిత్రాల్లో ఐటం సాంగ్‌లు చేసిన రాఖీ, అందులోని ఓ పాటను మిక్స్ చేస్తూ `అస్పలామే ఇష్క్యూమ్ యారా..` అంటూ రాశీ సావంత్ చేసిన నృత్యభంగిమలు, దుస్తులతో యువతను గిలిగింతలు పెట్టిస్తోంది. ఆర్టికల్ 370 సినిమాలో ఐటం సాంగ్ చేసిన తర్వాత మరలా సినిమాలు చేయలేదు. ప్రస్తుతం టీవీ షో చేస్తోంది.