శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (22:29 IST)

బేబమ్మతో రొమాన్స్ ఏంటి మహేశ్ బాబూ.. అంటోన్న నెటిజన్లు.. (video)

kriti shetty_Mahesh Babu
ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టి టీనేజర్. ఆమెతో ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు జోడీ కట్టబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనకంటే మూడు పదుల వయస్సు చిన్న వయస్కురాలైన కృతిశెట్టితో మహేష్ జతకట్టడం ఏమిటి? ఆమెతో రొమాన్స్ చేయడం ఏమిటని సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. కృతిశెట్టి వయస్సును ప్రిన్స్ వయస్సును పోల్చుతూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఇక ఈ విషయాన్ని పక్కనబెడితే ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కృతిశెట్టి. ఈ సినిమా విజయవంతం కావడంతో ఈ శాండిల్ వుడ్ బ్యూటీ ఫుల్ జోష్‌లో ఉంది. నిండా పద్దెనిమిదేళ్లు నిండని ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకపోతోంది.
 
ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని 'శ్యామ్ సింగరాయ్' లో ఛాన్స్ కొట్టేసిన కృతిశెట్టి... ఆ సినిమా పూర్తికాకముందే.. ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన మరో అవకాశాన్ని సంపాధించింది. తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్లో తెరకెక్కనుంది ఈ చిత్రం.
 
తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం ఏంటంటే, ఈ అమ్మడు ఏకంగా టాప్ స్టార్ సరసన నటించే చాన్స్ కొట్టేసిందంట. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రొమాన్స్ చేసేందుకు రెడీగా ఉందనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' తో మహేష్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో ఓ సినిమా చేయనున్నాడు.
 
అయితే.. ఆ సినిమా స్టార్ట్ అయ్యే లోపు మరో సినిమా ఫినిష్ చేయాలని ఆలోచిస్తున్నాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోనే కృతిశెట్టిని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నిజమైతే... కృతిశెట్టి టాప్ హీరోయిన్లకు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ పెద్దలు మాట్లాడుకుంటున్నారు.