మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 మార్చి 2021 (21:24 IST)

టాలీవుడ్ ప్రిన్స్‌తో ఆడిపాడాలని వుంది... మాళవికా మోహనన్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రహీరోగా కొనసాగుతున్నారు. వరుస విజయాలతో దూసుకెళుతున్నారు. తాజాగా సర్కారువారి పాట అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే, ఈ మహేష్ బాబుతో తమిళ హీరోయిన్ మాళవికా మోహనన్ ఆడిపాడాలని ఉందనే కోరిక కలిగింది.
 
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘పేట’ చిత్రంలో సహాయక పాత్రలో మాళవిక అలరించింది. ఈ మధ్యే విడుదలైన విజయ్‌ చిత్రం ‘మాస్టర్‌’లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. తాజాగా సోషల్‌ మీడియా వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ..‘‘తెలుగు నటుడు మహేష్‌బాబుతో కలిసి నటించాలని ఉందని తన మనసులో మాట’’ వెల్లడించింది.
 
హీరో మహేష్‌బాబు - మాళవికా మోహన్‌ల ఫోటోను ట్వీటర్‌ వేదికగా ఓ అభిమాని షేర్‌ చేస్తూ..‘‘ఈ కాంబినేషన్‌ కోసం ఎంత మంది వేచి చూస్తున్నారు’’ అని అడగ్గా.. మాళవిక స్పందిస్తూ..‘నేను కూడా’ అంటూ చేయి ఎత్తిన ఏమోజీని ట్వీటర్‌ వేదికగా పంచుకుంది.
 
ఇక మహేష్‌బాబు అభిమానులు అయితే ‘‘మీ కోసం మేం కూడా ఎదురుచూస్తున్నాం’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ధనుష్‌ కథానాయకుడిగా ‘డి43’ వర్కింగ్‌ టైటిల్‌గా తెరకెక్కుతున్న సినిమాలో మాళవికా మెహన్‌ నాయికగా నటిస్తోంది.
 
ఇక్కడో విషయం తెలుసా.. ఈ మాళవిక మోహనన్ ఎవరో కాదు. మహేష్‌ కథానాయకుడిగా నటించిన ‘మహర్షి’ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించిన కె.యు.మోహనన్‌ కుమార్తె కావడం గమనార్హం.