1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Malavika comparing the beauty of nature

ప్ర‌కృతి అందాన్ని కంపేర్ చేస్తున్న మాళ‌విక‌

Malavika Mohanan
Malavika Mohanan
త‌న అందాన్ని ప్ర‌కృతి అందంతో కంపోర్ చేస్తూ మైమ‌రిచిపోయింది మాళవిక మోహనన్  మ‌ల‌యాళ న‌టి అయిన ఈమె ఈనెల‌లో వెడ్డింగ్ వోవ్స్‌.. అనే మేగ‌జైన్‌కు ఓ ఫోజ్ కూడా ఇచ్చింది. ఆ మేగ‌జైన్ 10 వ‌సంతాల ఇష్యూలో భాగ‌మైనందుకు ఆనందంగా వుందంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు ప్ర‌కృతితో మ‌నిషిమ‌మేకం కావాలంటూ కొండ‌లు, సెల‌యేర్లు వున్న ప్రాంతానికి వెళ్ళి ఫొటో సెష‌న్ చేసింది. ప్రపంచానికి దూరంగా.. అంటూ పోస్ట్ చేసింది.

Malavika Mohanan-1
హిందీ, క‌న్న‌డ‌లో కూడా న‌టించిన ఈ భామ సినిమాటోగ్రాఫర్ కె. యు. మోహనన్ కుమార్తె ఈమె.  దుల్కర్ సల్మాన్ సరసన పట్టం పోల్ అనే రొమాంటిక్ డ్రామాతో నటనా రంగ ప్రవేశం చేసింది. ద‌క్షిణాదిలో తెలుగు సినిమావైపు దృష్టి సారించ‌లేదు. మ‌రి ఈ ఫొటో సెష‌న్స్ ఎవరినైనా ఆక‌ట్టుకుంటాయో చూడాలిమ‌రి.
About Writer
డీవీ