శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Modified: బుధవారం, 11 నవంబరు 2020 (15:51 IST)

మెరుపు తీగకు చెల్లి నటాషా దోషి

మొన్నటి వరకు బొద్దుగా ముద్దుగా కనిపించిన నటాషా దోషి ఇప్పుడు ఒక్కసారిగా స్లిమ్ అయిపోయింది. మెరుపుతీగకు చెల్లిలా మారిపోయింది. నందమూరి బాలకృష్ణ సరసన జై సింహా సినిమాలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. అమ్మకుట్టి అమ్మకుట్టి అంటూ అదిరిపోయే స్టెప్పులు వేసింది. అందులో బాలయ్యకు పోటీగా నటాషా వేసిన డాన్సులకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
 
జై సింహాలో కాస్త బొద్దుగా కనిపించిన ఈ బొద్దుగుమ్మ.. ఇప్పుడు పూర్తిగా బరువు తగ్గిపోయి స్లిమ్ అయిపోయింది. తాజాగా విడుదలైన ఈమె ఫోటోషూట్ చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు. రెడ్ అండ్ గోల్డ్ కలర్ డ్రెస్సులో అమ్మడి చూపులకు అందరూ బాపురే క్యా షేపురే అంటున్నారు. మరోవైపు బ్లాక్ అండ్ టైట్ జీన్స్ లోనూ సన్నగా మెరుపు తీగలా అదిరిపోయే గ్లామర్ షో చేస్తూ కొంటె చూపులతో ఊపిరి తీస్తుంది నటాషా దోషి.
జై సింహా తర్వాత మరికొన్ని అవకాశాలు కూడా అందుకుంది ఈ భామ. తాజాగా తన మేకోవర్ తో దర్శక నిర్మాతలతో పాటు ప్రేక్షకుల మతి పోగొడుతుంది. నటాషాను ఇలా చూసిన తర్వాత అవకాశాలు ఇవ్వకుండా మాత్రం ఎందుకు ఉంటారు. ఇప్పటికే ఈ భామకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. కచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. కెరీర్ లో ఒక మంచి బ్రేక్ వస్తే చాలు ఖచ్చితంగా నటాషా చక్రం తిప్పడం లాంఛనమే. మరి ఆ బ్రేక్ ఇచ్చే ఆఫర్ ఎప్పుడు వస్తుందో చూడాలి.