గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 మార్చి 2021 (18:23 IST)

17ఏళ్ల బాలికపై లైంగిక దాడి.. నగ్నంగా ఫోటోలు తీసి బెదిరింపులు.. తర్వాత..?

వయోబేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా బాలికపై లైంగిక దాడితో పాటు.. బెదిరింపులకు పాల్పడిన నిందితుడు, అతని స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. అమలాపురంకు చెందిన 17ఏళ్ల బాలిక పోటీ పరీక్షల శిక్షణ కోసం రాజమహేంద్ర వరం వెళ్లింది. అక్కడ ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చివరి ఏడాది చదువుతున్న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన మణి వెంకట సత్యనారాయణతో పరిచయమైంది. అలా ఓ రోజు బాలికను గుడికి రప్పించి మాట్లాడాడు. 
 
తన కోరికను తీర్చని పక్షంలో చంపేస్తానని బెదిరించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై నగ్నచిత్రాలు తీసి బెదిరించాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని వేధిస్తూ వచ్చాడు. అతని ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో తల్లిదండ్రులకు బాధితురాలు ఈ విషయం తెలిపింది. 
 
వారి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. అలాగే నిందితుడికి సహకరించిన 15మంది స్నేహితులపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తారు. వీరిలో విద్యార్థినులు కూడా వున్నారని పోలీసులు వెల్లడించారు.