శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (22:11 IST)

కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష కోసం వెళ్లి.. అర్ధనగ్నంగా యువతి హత్య.. కారణం..?

దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా బీహార్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు హాజరయ్యేందుకు వెళ్లిన యువతి నాలుగు రోజుల తర్వాత మృతదేహం లభ్యమైంది. పోలీస్‌ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు హాజరయ్యేందుకు మార్చి 14న బెటా నుంచి వెళ్లిన యువతి ఆపై ఇంటికి తిరిగిరాలేదు. 
 
యువతి చివరిసారిగా ఆదివారం రాత్రి 8 గంటలకు పరీక్ష రాసి ఆటోలో ఇంటికి తిరిగివస్తూ తమతో మాట్లాడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కొద్దిగంటల తర్వాత ఆమె ఫోన్‌ స్విచాఫ్‌ అయిందని, అర్ధరాత్రి దాటినా యువతి ఇంటికి చేరుకోకపోవడంతో మరుసటి రోజు ఉదయం కుటుంబసభ్యులు చితహ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోని గ్రామంలో బుధవారం ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 
 
యువతి మృతదేహం అర్ధనగ్నంగా పడిఉందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. యువతిపై ఆటో డ్రైవర్‌ లైంగిక దాడికి పాల్పడి హత్య చేసి ఉంటాడని అనుమానించి స్థానికులు ఆటో డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో ఆటో డ్రైవర్‌ నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిపై కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.