1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (15:49 IST)

ఏడాది పాటు శృంగారానికి నో.. భార్యాబిడ్డకు బీర్ తాగించిన ఎన్నారై!

ఎన్నారై సంబంధాలంటే చాలు ఎగిరిగంతేసే వారు చాలామంది వున్నారు. వారికి భారీగా కట్నకానుకలు సమర్పించుకుని.. ఆ తర్వాత వారి చేతిలో మోసపోయి కోర్టు మెట్లు ఎక్కేవారు ఇంకా చాలానే మందే వున్నారు. తాజాగా ఎన్నారై సంబంధంతో మోసపోయిన ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది.

ఎన్నారై భర్త అదనపు కట్నం కోసం వేధిస్తూ.. తనతో సఖ్యంగా ఉండటం లేదని.. పైగా ఏడాదిగా తనతో శృంగారం జరపలేదని.. అంతేకాకుండా భార్యాబిడ్డల చేత బీర్‌ తాగిస్తూ సైకోలా ప్రవర్తిస్తున్నాడని.. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ గుజరాత్‌ పోలీసులను ఆశ్రయించింది.
 
వివరాల్లోకి వెళితే.. బాధితురాలికి 2016లో వివాహం అయ్యింది. ఏడాది తర్వాత భర్తతో కలిసి ఆమె దుబాయ్‌కు వెళ్లింది. ఇండియాలో ఉన్నన్ని రోజులు తనను బాగానే చూసుకున్న భర్త దుబాయ్‌ వెళ్లిన నాటి నుంచి హింసించడం ప్రారంభించాడని తెలిపింది. 
 
దుబాయ్‌ వెళ్లాక అతడిలోని సైకో బయటకు వచ్చాడు. అదనపు కట్నం తేవాల్సిందిగా  బాధితురాలిని వేధింపులకు గురిచేసేవాడు. అతంటితో ఊరుకోక భార్య చేత బలవంతంగా బీర్‌ తాగించేందుకు ప్రయత్నించేవాడు. ఎంత సైకోలా ప్రవర్తించేవాడంటే రెండేళ్ల తన కుమార్తె చేత బీర్‌ తాగించేవాడు. ఇక ఏడాదిగా భార్యతో శృంగారానికి కూడా దూరంగా ఉంటున్నాడు. తాను అడిగినంత కట్నం ఇస్తేనే కాపురం చేస్తానని తేల్చి చెప్పేశాడు. 
 
ఇక బిడ్డకు, బాధితురాలికి ఆరోగ్యం బాగాలేకపోయినా పట్టించుకునేవాడు కాదు. ఆస్పత్రికి తీసుకెళ్లడం.. మందులిప్పించడం వంటివి చేసేవాడు కాదు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో భర్తతో కలిసి ఇండియాకు వచ్చింది బాధితురాలు. భర్త ఆమెను తన పుట్టింట్లో వదిలేసి దుబాయ్‌ చెక్కేశాడు. అతడి చేష్టలతో విసిగిపోయిన మహిళ అహ్మదాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.