1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. DS son, Sanjay booked in sexual harassment case

డీఎస్ కుమారుడు సంజయ్‌పై నిర్భయ కేసు.. అరెస్టుకు ప్రయత్నాలు

తెలంగాణ రాష్ట్ర సమితి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కుమారుడు సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ పలువురు విద్యార్థినిలు ఆరోపించారు. ఈ ఆరోపణల మేరకు డీఎస్ కుమారుడు సం

DS son
తెలంగాణ రాష్ట్ర సమితి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కుమారుడు సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ పలువురు విద్యార్థినిలు ఆరోపించారు. ఈ ఆరోపణల మేరకు డీఎస్ కుమారుడు సంజయ్‌పై నిర్భయ చట్టం కింద లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 
 
సంజయ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ నిజామాబాద్‌లోని ఆయన సొంత కళాశాల ''శాంకరి''కి చెందిన నర్సింగ్ విద్యార్థినులు గురువారం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థినులు వారి తల్లిదండ్రులు, పీవోడబ్ల్యూ సంధ్యతో కలిసి గురువారం సచివాలయంలోని చాంబర్‌లో హోంమంత్రిని కలిసి ఈ మేరకు ఫిర్యాదు అందజేశారు. 
 
బాధిత విద్యార్థినుల ఫిర్యాదు మేరకు సంజయ్ పై కేసు నమోదు చేశారు. కాగా, సంజయ్‌ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, సంజయ్ అక్కడ లేకపోవడంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే తనపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణల్లో వాస్తవం లేదని డీఎస్ కుమారుడు సంజయ్‌ చెప్పారు. తనకు భార్య పిల్లలు ఉన్నారు. ఎవరితో సహజీవనం చేయడం లేదు. ఎవరో విద్యార్థినులతో అలా చెప్పించారని విమర్శించారు. 
About Writer
Selvi
తర్వాతి కథనం
వైసిపి నాయకులకు ఏమైంది? ఒకరేమో బూతులు.. మరొకరేమో వార్నింగ్‌లు..