మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 7 జులై 2018 (10:06 IST)

యువతితో తెరాస ఎంపీ రాసలీలలు .. నిరూపిస్తే ఉరేసుకుంటాడట...!!

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి చెందిన ఎంపీ బాల్క సుమన్ ఓ యువతితో రాసలీలలు జరిపినట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ఆయన పెదవి విప్పారు. తాను ఆ యువతితో రాసలీలలు జరిపినట్టు నిరూపిస్తే హైదరాబాద్ ట్

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి చెందిన ఎంపీ బాల్క సుమన్ ఓ యువతితో రాసలీలలు జరిపినట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ఆయన పెదవి విప్పారు. తాను ఆ యువతితో రాసలీలలు జరిపినట్టు నిరూపిస్తే హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఉరేసుకుంటానని ప్రకటించారు.
 
సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ, ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని అన్నారు. ప్రాణ త్యాగానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఆరోపణలు నిరూపిస్తే ట్యాంక్ బండ్‌పై అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఉరేసుకుంటానన్నారు.
 
పైగా, మంచిర్యాలకు చెందిన బోయిని సంధ్య, బోయిని విజేతలు అక్కాచెల్లెళ్లని వివరించారు. సంధ్య తనను మోసం చేయాలని ఆరు నెలల క్రితమే ప్లాన్ చేసిందని చెప్పారు. తాను భార్య, కుమారుడితో కలిసి దిగిన ఫొటోలో తన భార్య స్థానంలో సంధ్య ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసిందని సుమన్ ఆరోపించారు. 
 
తనను బ్లాక్ మెయిల్ కూడా చేసిందన్నారు. ఈ ఏడాది జనవరి 27నే ఆమెపై ఫిర్యాదు చేసినట్టు సుమన్ వివరించారు. బ్లాక్ మెయిల్ నేరంపై ఫిబ్రవరి 6న వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో కూడా హాజరు పరిచారని ఎంపీ గుర్తు చేశారు. 
 
మరోవైపు సుమన్ పై వచ్చిన లైంగిక ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని మంచిర్యాల సీఐ మహేశ్ తెలిపారు. బాధితులుగా చెబుతున్న సంధ్య, విజేతలు చూపిస్తున్న ఆధారాల్లో నిజం లేదన్నారు. ఫొటోను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడినట్టు విచారణలో తేలిందని సీఐ పేర్కొన్నారు.