మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By TJ
Last Modified: శనివారం, 31 మార్చి 2018 (16:32 IST)

మంచిర్యాల కలెక్టర్‌గా దీపికా పదుకునె..?

దీపికా పదుకునె ఏంటి.. కలెక్టర్ అవ్వడమేంటి.. అని ఆశ్చర్యపోతున్నారా.. ఆమె ఎప్పుడు అసలు ఐఎఎస్ చదివింది.. అనుకుంటున్నారా.. ఇదంతా మంచిర్యాలలో జరిగిన ప్రచారం. ప్రస్తుతం ఉన్న కలెక్టర్ కర్ణన్ బదిలీపై వెళ్ళుపోతున్నారని, బాలీవుడ్ నటి దీపికా పదుకునె కలెక్టర్‌గా

దీపికా పదుకునె ఏంటి.. కలెక్టర్ అవ్వడమేంటి.. అని ఆశ్చర్యపోతున్నారా.. ఆమె ఎప్పుడు అసలు ఐఎఎస్ చదివింది.. అనుకుంటున్నారా.. ఇదంతా మంచిర్యాలలో జరిగిన ప్రచారం. ప్రస్తుతం ఉన్న కలెక్టర్ కర్ణన్ బదిలీపై వెళ్ళుపోతున్నారని, బాలీవుడ్ నటి దీపికా పదుకునె కలెక్టర్‌గా వస్తున్నారని తెలంగాణా రాష్ట్రం మొత్తం ప్రచారం జరిగింది. 
 
అదెలాగంటే.. గత కొన్నిరోజుల ముందు తెలంగాణా ప్రభుత్వం కలెక్టర్లను బదిలీ చేసింది. బదిలీల్లో మంచిర్యాల కలెక్టర్ కర్ణన్ కూడా వెళ్ళిపోతున్నారని, ఆయన స్థానంలో దీపికా అనే మహిళ వస్తోందని అధికారులకు సమాచారం అందింది. గతంలో గిరిజనశాఖ డైరెక్టర్‌గా ఉన్న కర్ణన్ ఆ పదవిలోకి వెళ్ళిపోతున్నారని ప్రచారం జరిగింది. దీంతో అందరూ ఆయన తిరిగి అదే శాఖకు వెళ్ళిపోతున్నారని అనుకున్నారు. 
 
కానీ దీపికా అనే మహిళ పేరుకు బదులు నటి దీపికా పదుకునె అంటూ జనాల్లో ప్రచారం జరగడం ప్రారంభమైంది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. నటి ఐఎఎస్ ఎప్పుడు చదివింది.. ఆమె కలెక్టర్‌గా రావడం ఏంటి అని అందరూ భావించారు. 
 
ఇదంతా ఫేస్ బుక్ పుణ్యమే.. మంచిర్యాలలోని కొంతమంది యువకులు ఫేస్ బుక్‌లో దీపికాకు బదులు దీపికా పదుకునె అంటూ ఫోటోలు పెట్టి పోస్టులు చేశారు. ఇది కాస్త వైరల్ అయ్యింది. ఇదే విషయాన్ని కలెక్టర్ కర్ణన్‌ను ప్రశ్నిస్తే తన బదిలీ తనకే తెలియదని, అసలు నటి ఎందుకు కలెక్టర్‌గా వస్తారని, ఫేస్ బుక్ ద్వారా ఎవరు పోస్టు చేశారో తెలుసుకుని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు మంచిర్యాల కలెక్టర్ కర్ణన్.