ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 13 మార్చి 2018 (17:41 IST)

'అవకాశాలకు పడక సుఖమా?... అందాల వస్తువు'గానే చూశారు : ఇలియానా

చిత్ర పరిశ్రమ చీకటి కోణంపై గోవా బ్యూటీ ఇలియానా స్పందించారు. ఆమె తన తాజా చిత్రం "రైడ్" ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజిగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆమె కాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు.

చిత్ర పరిశ్రమ చీకటి కోణంపై గోవా బ్యూటీ ఇలియానా స్పందించారు. ఆమె తన తాజా చిత్రం "రైడ్" ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజిగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆమె కాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. గతంలో దక్షిణాది సినీ పరిశ్రమ తనను 'అందాల వస్తువు'గా వాడుకుందని ఆరోపించారు. ఇపుడు మరోలా స్పందించారు.
 
సినీ పరిశ్రమలో లైంగికహింస గురించి బహిరంగంగా ప్రశ్నించే తారల కెరీర్ ముగిసిపోతుందా? అనే ప్రశ్నకు ఈ గోవా బ్యూటీ స్పందిస్తూ, 'అవకాశాలకు పడక సుఖం' అంశంపై మాట్లాడితే మాత్రం కెరీర్ అంతమవుతుందన్న వాదనతో తాను ఏకీభవిస్తానని చెప్పుకొచ్చింది.
 
దీనికి సంబంధించి కొన్నేళ్ల క్రితం దక్షిణాదిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఓ బడా నిర్మాత నుంచి ఇదే రకమైన ఇబ్బందిని ఎదుర్కోగా, ఆమె తన సలహా కోరిందని తెలిపింది. అయితే అందుకు తానేమీ చెప్పలేకపోయానని, ఆమె సొంత నిర్ణయానికే వదిలేశానని ఇలియానా చెప్పుకొచ్చింది. 
 
ఎవరైనా నటీనటులు వేధింపులకు గురవుతున్నట్లు చెబితే వారికి మిగిలిన వారు బాసటగా నిలవాలని ఆమె కోరుతోంది. తన వ్యక్తిగత జీవితం గురించి తాను మాట్లాడేందుకు నిరాకరించింది.