గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 27 ఆగస్టు 2021 (12:50 IST)

భార్యతో బలవంతపు శృంగారం రేప్ కాదు

చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్యతో బలవంతపు శృంగారం అత్యాచారం కిందకు రాదని ఛత్తీస్ గఢ్ హైకోర్టు తెలిపింది. సెక్షన్ 376 కింది 37 ఏళ్ల వ్యక్తిపై నమోదైన కేసును విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది.
 
భార్య వయసు 18 ఏళ్ల లోపు లేకుండా ఆమెతో చట్టబద్ధంగా వివాహమైతే, బలవంతం శృంగారం చేసినా అది అత్యాచారం కిందకు రాదని తెలిపింది. ఈ విషయాన్ని సెక్షన్ 376 లోని రెండో మినహాయింపు స్పష్టంగా చెపుతుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీనితో 37 ఏళ్ల వ్యక్తికి ఆ కేసు నుంచి తప్పించింది.