శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 ఆగస్టు 2021 (11:46 IST)

ఒడిషాలో పతీసహగమనం : భార్య మృతిని తట్టుకోలేక...

ఒడిషా రాష్ట్రంలో పతీసహగమనం జరిగింది. భార్య మృతిని తట్టుకోలేని భర్త కూడ్ ప్రాణాలు తీసుకున్నాడు. భార్య చితిలో దూకి అందరూ చూస్తుండగానే కాలిబూడిదయ్యాడు.  
 
ఒడిశాలోని కలహండి జిల్లా గోలముండా సమితిలోని శైలుజోడి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన రాయబారి (60), నీలమణి శబర (65) భార్యాభర్తలు. వీరికి నలుగురు కుమారులు. రాయబారి మంగళవారం గుండెపోటుతో ఇటీవల మృతి చెందింది.  
 
ఆమె అంత్యక్రియల కోసం మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ చితిపేర్చి మృతదేహానికి నిప్పు అంటించారు. అనంతరం అందరూ ఇళ్లకు బయలుదేరారు. అందరితోపాటే ఇంటికి బయలుదేరిన నీలమణి ఆ తర్వాత ఒక్కఉదుటున వెనక్కి పరిగెత్తుకొచ్చి భార్య చితిమంటల్లో దూకాడు. అందరూ చూస్తుండగానే అతడు భార్యతో సహా దహనమయ్యాడు. దీంతో ఆ గ్రామంలో విషాదకర ఘటన జరిగింది