1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Government to redevelop Parliament building or build new one by 2022

పార్లమెంట్‌కు కొత్త బిల్డింగ్ : అన్ని శాఖలకు ఉమ్మడి భవన సముదాయం

Parliament
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే 2022 నాటికి పార్లమెంట్‌కు కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించింది. ఇక్కడే అన్ని శాఖలకు ఉమ్మడి భవన సముదాయం నిర్మించనున్నారు. పైగా, 2022లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ కొత్త భవనంలో జరుగుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
అలాగే, అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖల కోసం ఉమ్మడి భవన సముదాయ నిర్మాణం కూడా త్వరలో ప్రారంభంకానుంది. దీంతో పాటు రాష్ట్రపతి భవన్ ‌- ఇండియా గేట్‌ను అనుసంధానిస్తూ మూడు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 'సెంట్రల్‌ విస్టా' ఆధునిక హంగులతో పునర్నిర్మించనున్నారు. ఈ మూడింటికి సంబంధించి కన్సల్టెన్సీ పనుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌, ఆర్కిటెక్చర్‌ సంస్థల నుంచి ప్రతిపాదనలను కేంద్రం ఆహ్వానించింది. 
 
కాగా, ప్రస్తుత పార్లమెంట్ భవన్ గత 1927లో నిర్మించారు. ఇందులో సదుపాయాలు ఇప్పటి అవసరాలకు సరిపోవడం లేదని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ భవనంలో ఎంపీలకు చాంబర్లు లేవని, కార్యాలయాలకు స్థలం కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుత భవనాన్ని ఇప్పటి ముఖాకృతితోనే అభివృద్ధి చేయడం లేదా కొత్త భవనం నిర్మించడం ఎంతో అవసరమని తెలిపాయి. 
తర్వాతి కథనం
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి సేవలో చీఫ్ సెక్రటరీ ఎల్వీ