లతా మంగేష్కర్‌కి అరుదైన గౌరవం
బాలీవుడ్ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్‌కి అరుదైన గౌరవం దక్కింది. తన మధుర మైన గాత్రంతో ఎన్నో దశాబ్దాలుగా అలరిస్తున్న గాన కోకిలను ‘డాటర్ ఆఫ్ ది నేషన్’ బిరుదుతో ప్రభుత్వం సత్కరించనుంది. ఈనెల 28వ తేదీన లతా మంగేష్కర్ 90వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఆ రోజున ఈ బిరుదును ప్రదానం చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది.
1942లో గాయనిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన లత... వెయ్యికి పైగా సినిమాల్లో దాదాపు పాతిక వేల పాటలు పాడారు. 36 భాషల్లో పాటలు పాడిన ఘనత ఆమెది. సినీ రంగానికి ఆమె చేసిన సేవలకుగాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఆ తర్వాత భారతరత్న పురస్కారం కూడా దక్కింది.
2007లో ఫ్రాన్స్ ప్రభుత్వం తమ దేశపు అత్యున్నత పురస్కారమైన ‘ఆఫీస్ ఆఫ్ లీజియన్ ఆనర్’తో గౌరవించింది. ఇంకా పద్మభూషణ్, పద్మ విభూషణ్‌లతోపాటు పలు అవార్డులు ఆవిడను వరించాయి. అంత గొప్ప గాయని కనుకనే పుట్టినరోజు నాడు బిరుదు రూపంలో అందమైన కానుకను ఇవ్వాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది.