సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : శుక్రవారం, 28 జూన్ 2019 (19:14 IST)

అమ్మా... నాన్నా అంటున్నా... కన్నకుమార్తెను కట్టేసి కొట్టి చంపిన తండ్రి.. ఎందుకంటే?

చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్నదని కన్నకూతుర్ని గొడ్డును కొట్టినట్లు కొట్టికొట్టి చంపేశాడు ఆమె తండ్రి. అతడికి చేతులు ఎలా వచ్చాయో... అమ్మా... నాన్నా అంటూ అరిచి అభ్యర్థించినా ఆమెను వదల్లేదు.
 
వివరాల్లోకి వెళితే... ఒకటిన్నర సంవత్సరం క్రితం పలమనేరు సమీపంలోని ఉసరపెంట గ్రామానికి చెందిన హేమావతి, కేశవులు ప్రేమించుకున్నారు. కేశవులు దళితుడు కావడం.. హేమావతి కమ్మ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో పెద్దలు వివాహానికి అంగీకరించలేదు. దీంతో ఇద్దరు ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. 
 
సంవత్సన్నరక్రితమే వీరిద్దరికి వివాహమైంది. కేశవులు వేరు కాపురం పెట్టి జీవనం సాగిస్తున్నాడు. ఏడు రోజుల క్రితం వీరికి పండంటి మగబిడ్డ జన్మించాడు. కేశవులు తల్లిదండ్రులు అన్ని మరిచిపోయి కోడలు, కొడుకును ఇంటికి తీసుకెళ్ళాలనుకున్నారు. 
 
మధ్యాహ్నం ఆటోలో ఇంటికి వెళుతుండగా హేమావతి తండ్రి ఇంకా బంధువులు ఆటో ఆపి కేశవులపై దాడి చేశారు.హేమావతిని తాళ్లతో బంధించి అత్యంత దారుణంగా కొట్టి చంపేశారు. హేమావతి మృతదేహాన్ని పక్కనే ఉన్న చెత్తగుంట పొలంలో పడేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.