సంబంధిత వార్తలు
- జమ్మూ కాశ్మీర్‌కు కరోనా రోగులను ఎక్స్‌పోర్ట్ చేస్తున్న పాకిస్థాన్: డీజీపీ
- జట్టు కోసం కాదు.. వ్యక్తిగత రికార్డుల కోసమే భారత క్రికెటర్ల ఆరాటం.. ఇంజమామ్
- నాన్ హాట్ స్పాట్ ఏరియాల్లో ఆంక్షలు సడలింపు - తొలి వైరాలజీ ల్యాబ్
- భారత్‌లో కరోనా స్వైర విహారం - 24 గంటల్లో 1409 కేసులు
- కరోనావైరస్: డాక్టర్ల అంత్యక్రియలను ప్రజలు ఎందుకు అడ్డుకుంటున్నారు?
మే నెలలో 75 వేలకు చేరుకోనున్న కరోనా కేసులు??
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలుచేస్తోంది. అయినప్పటికీ కేసుల తగ్గుదల కనిపించకపోగా నానాటికీ పెరిగిపోతోంది. ఫలితంగా ఇప్పటికే 21 వేల మార్కుకు తాకాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే మే నెల రెండో వారానికి ఈ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 75 వేలకు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ వైరస్ వ్యాప్తి మే నెలలో ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా, ఇటలీ, అమెరికా దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కేంద్ర ఆరోగ్య శాఖ, నిపుణులు అంచనా వేసి ఈ సంక్షోభాన్ని నివారించేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఇటలీ, అమెరికా దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని ఏ విధంగా అడ్డుకున్నారో నిశితంగా విశ్లేషించి ఇదే విధానాన్ని కూడా భారత్‌లో అమలు చేయొచ్చని ఆ నివేదిక పేర్కొంది. పైగా, లాక్‌డౌన్ ఎత్తివేసే అంశంలో కూడా అన్ని పరిస్థితులను విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
అంతేకాకుండా, ప్రస్తుతం మే మూడో తేదీ వరకు కొనసాగనున్న లాక్‌డౌన్‌ను మే నెలాఖరు వరకు పొడగించాలనే వాదనలు మీడియాలో వినిపిస్తున్నాయి. అలా చేస్తేనే జూన్ నెల మధ్యంతరానికి కరోనా కేసుల సంఖ్య సున్నాకు చేరుకోవచ్చని భావిస్తున్నారు.
