1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Jet Airways passengers bleed mid-air after crew forgets to maintain cabin pressure; flight turns back

ఫ్లైట్‌లో బ్లీడ్‌ స్విచ్‌ అంటే ఏంటి.. ఆన్ చేయడం మరిస్తే ఏం జరుగుతుంది?

విమానంలో పైలట్ల క్యాబిన్‌లో బ్లీడ్ స్విచ్ ఉంటుంది. అంటే విమానం గాల్లో ఎగురుతున్నపుడు క్యాబిన్‌లో పీడనం నిర్వహించేందుకు వీలుగా బ్లీడ్ స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్‌ను విమానం బయలుదేరే సమయానికి ముందుగానే ఆన్

Jet Airways
విమానంలో పైలట్ల క్యాబిన్‌లో బ్లీడ్ స్విచ్ ఉంటుంది. అంటే విమానం గాల్లో ఎగురుతున్నపుడు క్యాబిన్‌లో పీడనం నిర్వహించేందుకు వీలుగా బ్లీడ్ స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్‌ను విమానం బయలుదేరే సమయానికి ముందుగానే ఆన్ చేయాలి. అలా చేయకుండే విమానంలో ప్రాణవాయువు తగ్గిపోవడం వల్ల ప్రయాణికులు శ్వాసపీల్చడం కష్టంగా మారుతుంది. విమానంలో పీడనం తగ్గడం వల్ల ప్రయాణికుల చెవులు ముక్కుల్లో నుంచి రక్తస్రావం జరుగుతుంది.
 
అసలు ఈ పీడన మీట (బ్లీడ్ స్విచ్) నొక్కడం వల్ల జరిగే ఉపయోగమేంటంటే... క్యాబిన్‌లో పీడనం నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేకంగా గాలిని (దీనినే బ్లీడ్‌ ఎయిర్‌ అంటారు) పంప్‌ చేస్తారు. విమానం ప్రయాణిస్తున్నప్పుడే... బయట ఉన్న అతిశీతల గాలిని టర్బైన్‌ ఇంజన్లు లోపలికి లాక్కుంటాయి. ఆ గాలిని 200 డిగ్రీల దాకా వేడి చేస్తాయి. తర్వాత ఒక పద్ధతి ప్రకారం గాలిని క్యాబిన్‌లోకి పంప్‌ చేస్తారు. ఇదంతా జరగాలంటే విమానం బయలుదేరే ముందే సిబ్బంది 'బ్లీడ్‌ స్విచ్' ఆన్‌ చేయాలి. జెట్‌ ఎయిర్‌ వేస్‌ సిబ్బంది అదే మరిచిపోయారు. ఫలితంగా ముంబై - జైపూర్‌ల మధ్య నడిచే జెట్ ‌ఎయిర్‌వేస్‌లో ప్రయాణించిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
'పీడనం' మీట నొక్కడం మరిచిన పైలట్.. ప్రయాణికుల ముక్కు.. చెవుల నుంచి బ్లీడింగ్.. ఎలా?